BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్

Select Suryaa Now
వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్

రామచంద్రపురం, మేజర్ న్యూస్ :రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా మేడిశెట్టి శేషారావు నామినేషన్ కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. ర్యాలీ అనంతరం  మేడిశెట్టి శేషారావు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో పాటు ఏఎంసీ చైర్మన్ అక్కల రేశ్వంత్ రాయ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతి, ఇతర కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మేడిశెట్టి శేషారావు ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం శేషారావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ..రామచంద్రపురం పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గత రెండేళ్లలో పట్టణంలో సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చాం. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నాం అని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సేవ, సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
కూటమి పార్టీ చైర్మన్ అభ్యర్థి  మేడిశెట్టి శేషారావుకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం, పారిశ్రామికవేత్తగా గుర్తింపు, సీనియర్ మాజీ జర్నలిస్టుగా సమాజంపై అవగాహన ఉన్నాయని మంత్రి సుభాష్ తెలిపారు

. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన ఆయనకు చైర్మన్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రామచంద్రపురం పట్టణ ప్రజలు మేడిశెట్టి శేషారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని 32 వార్డుల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుమాట్లాడుతూ పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో ఒక్క అవకాశం కల్పిస్తే, ఆనమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను అని హామీ ఇచ్చారు. 

మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
తనకు కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్, సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతితో పాటు ఇతర కూటమి నాయకులకు శేషారావు కృతజ్ఞతలు తెలిపారు

.మంత్రి సుభాష్ పట్టణానికి, నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి నిధులు, చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు తన విజయానికి స్ఫూర్తని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణంలో పశువుల కబేళా తొలగింపునకు మంత్రి సుభాష్ చేసిన కృషి ప్రజలకు గుర్తుండిపోయే అంశమని అన్నారు. మేడిశెట్టి శేషారావు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి శేషారావు ర్యాలీలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.