టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్..
ముమ్మిడివరం మేజర్ న్యూస్ పార్టీ అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి ముమ్మిడివరం వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని టిడిపి సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లకోటి దొరబాబులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో చిక్కాల అంజిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా సమావేశం అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చి మహేశ్వరరావు మృతికి సంతాపం వ్యక్తం చేసింది. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామ కమిటీ అధ్యక్షులకు నాయకులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఎంపీటీసీగా జడ్పిటిసి గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఎక్కువమంది ఆశిస్తే ఆ విషయాన్ని అధిష్టానానికి తీసుకొస్తే వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించాలన్నారు. ఈ సమావేశంలో పొద్దోకు నారాయణరావు నడిమింటి సూర్య ప్రభాకరo చిక్కాల బాబులు గొల్లపల్లి ధర్మారావు సబ్బతి డేవిడ్ రాజు అడబాల సతీష్ పిల్లి నాగరాజు మిమ్మితి చిరంజీవి యళ్ల ఉదయ్ తాడి జానకిరామ్ బొంతు నాగరాజు యనమదల సుబ్బారావు ఇందుకూరి పాండురంగరాజు కుంచనపల్లి వెంకన్న బాబు గోదసి గణేష్ కురసాల శివ బాబు బొక్క సత్తిబాబు చప్పిడి వరప్రసాద్ పళ్ళ రాజబాబు మట్ట సత్తిబాబు రంకిరెడ్డి రాంబాబు కోరసిక రాము ఇసుకపట్ల వెంకటేశ్వరరావు చిక్కాల పనసయ్య రేలంగి గౌడ బొక్క ధర్మ రావు తదితరులు పాల్గొన్నారు.