BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

వారసత్వాలకే సొసైటీల పీఠాలా..?

Select Suryaa Now
వారసత్వాలకే సొసైటీల పీఠాలా..?

 

 

కొండాపూర్‌  ;. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల భర్తీపై కొండాపూర్‌ మండలంలో రాజకీయ చర్చ వేడెక్కుతోంది. పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాది దాటుతున్న నేపథ్యంలో, నామినేటెడ్‌ విధానంలో కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసే అంశంపై అధికార పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? గతంలో పదవులు నిర్వహించిన కుటుంబాలకే మళ్లీ ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఐదు సొసైటీల్లో సామాజిక సమీకరణాలు!

కొండాపూర్‌ మండల పరిధిలో మల్కాపూర్‌, గొల్లపల్లి, తెర్పొల్ మారేపల్లి, కొండాపూర్‌ గ్రామాల్లో ఐదు పీఏసీఎస్‌లు ఉన్నాయి. గతంలో మల్కాపూర్‌, మారేపల్లి సొసైటీల చైర్మన్‌ పదవులు బీసీ సామాజిక వర్గానికి, కొండాపూర్‌, గొల్లపల్లి, తెర్పొల్ ‌ సొసైటీల చైర్మన్‌ పదవులు ఓసీ సామాజిక వర్గానికి దక్కాయి. ప్రస్తుతం నామినేటెడ్‌ విధానంలో పదవుల భర్తీ జరిగితే సామాజిక వర్గాల వారీగా సమీకరణాలు మారే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మల్కాపూర్‌ సొసైటీని బీసీ సామాజిక వర్గానికి, మారేపల్లి సొసైటీని ఎస్టీ సామాజిక వర్గానికి, తెర్పొల్ ‌ సొసైటీని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే దిశగా పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈసారి బీసీ వర్గానికి అవకాశం కల్పించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కొండాపూర్‌ సొసైటీలో ప్రస్తుత నాయకులకు అవకాశం కుదరకపోతే మైనారిటీ వర్గానికి చైర్మన్‌ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. , ఈ ప్రతిపాదనలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుత చైర్మన్లకు అవకాశం లేదా?

సొసైటీల్లో ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారికి మరోసారి అవకాశం కల్పించడం కుదరకపోవడంతోనే ఇతరులకు పదవులు ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊ హ ఘనలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులు సూచించిన వారికే పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ  నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆశావహులకు ఈసారి అవకాశం దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలే తప్ప అధికారికంగా ఖరారైన నిర్ణయాలు కావు.

వారసత్వాలకే పదవులా.. కొత్తవారికి మొండిచేయా?

పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవులు కొందరి కుటుంబాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు పార్టీలోని కొందరు నాయకుల నుంచి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గతంలో కుటుంబ సభ్యులకు పదవులు దక్కగా, తిరిగి వారి వారసులకే అవకాశాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు పార్టీ కోసం పనిచేసిన వారిని, కొత్తవారిని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నట్లు చర్చ సాగుతోంది.

నామినేటెడ్‌ విధానం అమలుపై ఉత్కంఠ

ప్రభుత్వం అనుసరించనున్న నామినేటెడ్‌ విధానం, ప్రస్తుత పాలకవర్గాల కొనసాగింపుపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత చైర్మన్లు, డైరెక్టర్లందరినీ కొనసాగిస్తారా? లేక కొత్తవారితో పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారా? అనే అంశంపై అధికారుల నిర్ణయం కీలకంగా మారనుంది. ఒకవేళ కొత్త నియామకాలు జరిగితే ఐదు సొసైటీల్లో సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీ అంతర్గత సిఫార్సులు, స్థానిక నాయకుల ప్రభావం కీలక పాత్ర పోషించే అవకాశముంది.మొత్తంగా, కొండాపూర్‌ మండలంలోని ఐదు పీఏసీఎస్‌ల చైర్మన్‌ పదవుల భర్తీ అధికార పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తారా? కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికి కొనసాగింపు లభిస్తుంది? అన్నది ప్రభుత్వ నిర్ణయం, పార్టీ నాయకత్వం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంది.