నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
రాయికోడ్ ; మండలంలోని నాగన్ పల్లి గ్రామంలో ఆదివారం నాడు బతుకమ్మ సంబరాలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ పండుగ సందడిని నింపారు. గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుజేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో మహిళలు, గ్రామస్తులు ఆనందంగా సంబరాల్లో పాల్గొన్నారు.