BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

అందరి సహకారంతో పనిచేస్తా...

Select Suryaa Now
అందరి సహకారంతో పనిచేస్తా...
  •  కూటమి అభ్యర్థులను గెలిపించండి....టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... 

    విజయనగరం బ్యూరో సూర్య: అధిష్టానం తనపై నమ్మకం తో ఇంతటి అవకాశం కల్పించిందని అందరి సహకారం తో ముందుకు సాగుతాన ని  టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి అన్నారు. శనివారం అశోక్ బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు పెద్ద బాధ్యత అప్పగించిన కూటమి అధిష్టానం కు దన్యవాదాలు తెలిపారు. 62 వార్డుల అభ్యర్థులు గెలిపించాలని కోరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మేయర్ అభ్యర్థి గా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం , అన్ని వర్గాల సముచిత స్థానం కల్పించాలని అదినేత చంద్రబాబు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందరితో కలిసి నడిచే వ్యక్తి విజయ్ అని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జరుగుతున్న అభివృద్ధి తో భారీ మెజార్టీ గెలిపించాలని, ఆశించి టికెట్ దక్కని వారిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. మాజీ జడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ విజయనగరానికి ఒక చరిత్ర ఉందన్నారు. అందునా అశోక్ హయంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో విజయ నగరం నియోజక వర్గానికి భారీ మెజార్టీ ఇచ్చారని ఎమ్మెల్యే ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆశీస్సులు తో భార్గవి అవకాశం కలిగిందన్నారు. నగర అభివృద్ధి లో అంతా కలిసి పనిచేస్తాం అన్నారు. ఈ సందర్భంగా లోక్ సత్తా మద్దతు ప్రకటిస్తుందని పార్టీ అధ్యక్షులు బీ శెట్టి బాబ్జీ స్పష్టం చేశారు.