ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు...
కావలి / బోగోలు:18
నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ చేరికలు పెరుగుతున్నాయి. బోగోలు మండలం బోగోలు మేజర్ పంచాయతీ కప్పరాల తిప్ప గ్రామానికి చెందిన పసుపులేటి సుధాకర్ ముఖ్య అనుచరుడు పీట్ల ప్రత్యుష్,పీట్ల దయాకర్, గొడ్డేటి ప్రకాష్,ఆవుల బాబు, గోగుల రాజు, బాణాల ఆదర్శ్, గోగుల నవీన్,తో పాటు ఆయన అనుచరులైన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడూతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ పాలన, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అందిస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై తామంతా టీడీపీలోకి చేరామని వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్యే సారథ్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు గారు, బోగోలు పిఎసిఎస్ ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు, గోచిపాతల సంజయ్, అద్భుత రాజ్, ఆకుల డేవిడ్ పాల్ వెంకటస్వామి, పుచ్చకాయల రమేష్, ఎస్ ఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు