సౌత్ జోన్ నేషనల్ నెట్‌బాల్ టోర్నీలో ఏపీ మహిళల జట్టు సత్తా: తృతీయ స్థానం కైవసం.. అసోసియేషన్ ప్రతినిధుల ప్రశంసలు!
సూర్య స్పోర్ట్స్ డెస్క్, రావులపాలెం: తెలంగాణలోని నిర్మల్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక 18వ సీనియర్ సౌత్ జోన్ మహిళా, పురుషుల నేషనల్ నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి తృతీయ స్థానాన్ని (కాంస్య పతకం) కైవసం చేసుకుంది. అక్టోబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ జాతీయ స్థాయి పోటీలలో ఏపీ క్రీడాకారిణులు అద్భుతమైన సమష్టి ఆటతీరుతో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
అసోసియేషన్ ప్రతినిధుల ప్రత్యేక అభినందనలు:
జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ మహిళా జట్టు క్రీడాకారిణులను సౌత్ జోన్ నెట్‌బాల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గిరీష్ గౌడ్, కన్వీనర్ ఆదిత్యరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారిణుల ప్రతిభ, పట్టుదల దక్షిణ భారత స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయని వారు కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలి – రాష్ట్ర నాయకత్వం:
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూదోటి శివారామ్ జట్టు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు భవిష్యత్తులో జరగబోయే జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని వారు ఆకాంక్షించారు.