BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు: 'గోవిందా ముకుందా' నామస్మరణతో మార్మోగిన ఆలయం

Select Suryaa Now
 వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు: 'గోవిందా ముకుందా' నామస్మరణతో మార్మోగిన ఆలయం

ఆత్రేయపురం మేజర్ న్యూస్: కోనసీమ తిరుమలగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ‘గోవిందా.. ముకుందా.. వెంకటరమణా’ అంటూ భక్తిప్రపత్తులతో జయజయధ్వానాలు చేశారు.

ఏడువారాల మొక్కులు – కల్యాణోత్సవాలు:
వాడపల్లి క్షేత్ర విశిష్టత ప్రకారం అత్యంత పవిత్రమైన ఏడువారాల ప్రదక్షిణల నోము నోచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ఆవరణలో వేదపండితుల సమక్షంలో భక్తులు అష్టోత్తర శతనామార్చనలు, శ్రీవారి నిత్య కల్యాణోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ప్రతిధ్వనించాయి. దర్శనానంతరం విచ్చేసిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదాల వితరణతో పాటు శ్రీవారి నిత్యాన్నదాన సత్రంలో విస్తృతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సౌకర్యాలను పర్యవేక్షించిన చైర్మన్, డిప్యూటీ కమిషనర్:
తీవ్ర రద్దీ నెలకొన్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూలైన్లు, మంచినీరు, ప్రసాదం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు స్వయంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు వేగవంతంగా దర్శనం కల్పించేలా సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.