స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
రామభద్రపురం, సూర్య: (.మేజర్ న్యూస్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు ప్రతీ ఒక్కరూ సహకారం అందివ్వాలని ఎస్ఐ వాన్న జ్ఞానప్రసాద్ కోరారు. మండల పరిధిలోని కొట్టక్కి గ్రామంలో శ నివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఐకమత్యంతో ఈ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కొట్లాటలు, వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టకుండా ప్రశాంతంగా ఎన్నికలకు సహకారం అందించాలన్నారు. అలాగే గ్రామాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కేసులు నమోదు చేస్తావ న్నారు. సైబర్ క్రైంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కూడా కేసులు నమోదు చేసి శిక్షలు వేస్తామని తెలిపారు.