రెండో రోజు 174 నామినేషన్లు
విజయనగరం సూర్య: నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 174 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ అభ్యర్థి కోసం 7 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్లుగా 167 మంది తమ నామినేషన్లను దాఖలు చేసారు. మొత్తం 17 కౌంటర్ల ద్వారా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. నామినేషన్ల ప్రక్రియను జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దామోదర్, డిఎస్పి వెంకటరమణమూర్తి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ కోసం చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్ బాలస్వామి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దామోదర్ కు వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించేందుకు అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో తొలిరోజు 19 నామినేషన్లు దాఖలు కాగా, ఈరోజు రెండవ రోజు 174 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు. రేపటి రోజున నామినేషన్లు స్వీకరణకు ఆఖరి తేదీ అని చెప్పారు. 19వ తేదీన నామ పత్రాలను పరిశీలన, 21వ తేదీన ఉపసంహరణకు గడువుగా ఉన్నదని చెప్పారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.