పురపాలక సంఘం వైసిపి అభ్యర్థులకు బి ఫారాలు అందచేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు అందరూ మంచి ఫలితాలు సాధించాలి
నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు
పురపాలక సంఘం 36 వార్డుల వైసిపి అభ్యర్థులకు పార్టీ బి ఫారాలు అందచేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం, అక్టోబర్ 17, మేజర్ న్యూస్ :పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల బరిలో నిలుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు శనివారం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో పార్టీ బీఫారాలు అందజేయడం జరిగినది. శుక్రవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి 97% నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని నామినేషన్ వేసిన అభ్యర్థుల అందరికి కూడా శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో భిపారాలు అందచేస్తూ అభ్యర్థులు అందరూ తప్పని సరిగా నామినేషన్ల పత్రాల తో పాటుగా పార్టీ బి ఫారం ఎన్నికల అధికారులకు ఆదివారం లోపు అందచేయాలని మాజీ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థులు అందరికీ సూచించడం జరిగినది. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మామిడి శ్రీనివాసరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే జోగారావు తో కలిసి పార్టీ బీఫారాలు అందజేస్థూ అభ్యర్థులు అందరూ ఈ స్థానిక సంస్థలు ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని, కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలకు జరిగిన మోసాలను ప్రజలవద్దా ఎండగడుతూ ప్రజల మద్దతు పొంది వైసిపి నాయకుల అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా కృషి చేయాలని ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా వార్డ్ నెంబర్ ఒకటి నుంచి 36 వరకు గల అన్ని వార్డులు అభ్యర్థులకు కూడా బీఫారాలు అందజేయడమే కాకుండా దాదాపుగా 97% నామినేషన్లు దాఖలు చేయడం జరిగినది అని పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల ప్రక్రియ వరకు అంతా సజావుగా సాగడం జరుగుతుందని రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులందరూ ముందుకు సాగడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.