BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ....

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ....
  •  విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ 
    విజయనగరం సూర్య: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ వేసే కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ విజయనగరం మున్సిపల్ ఆఫీస్, నెల్లిమర్ల నగర పంచాయతీ ఆఫీసు వద్ద నామినేషన్ కేంద్రాలను సందర్శించి, నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  మాట్లాడుతూ - 
    ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత ఏర్పడే పరిణామాలకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు  చేపట్టామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిబంధనల మేరకు నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోని అభ్యర్థులతో వచ్చే మద్దతుదారులను నిలిపి వేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని, సంబంధిత అధికారులతో మాట్లాడి, వాస్తవాలను నిర్ధారించుకున్న తరువాతనే వార్తలను ప్రచురించాలన్నారు.
    ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నందున ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 10వేలుకి మించి నగదును తమ వెంట తీసుకొని వెళ్లవద్దని, ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు లేవని, ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను, నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక దళాలను, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించామన్నారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డిఎస్పీ ఎస్.లక్షణమూర్తి, మున్సిపల్ కమీషనర్ బి.బాలస్వామి, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్.కోట సిఐ వి.ఎన్.మూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.