ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి:
సాధారణ పరిశీలకులు ఎస్. చిన్న రాముడు
పక్షపాతం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలి
ఎన్నికల విధుల పట్ల అప్రమత్తత అవసరం
జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం, అక్టోబర్ 17: మేజర్ న్యూస్ :ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి"ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు ఎలాంటి పక్షపాతం చూపకుండా, పూర్తి పారదర్శకత, నిష్పాక్షికతతో పనిచేయాలి" అని శనివారం జంఝావతి సమావేశ మందిరంలో ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.సాధారణ పరిశీలకులు ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ ఎన్నికల సంఘం , రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే బుక్లెట్లు, మార్గదర్శకాలను అభ్యర్థులు, ప్రతిపాదకులు ప్రతి ఒక్కరూ పూర్తిగా చదువుకోవాలి. ఏ చిన్న సందేహం ఉన్నా రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత అధికారులను సంప్రదించి వెంటనే నివృత్తి చేసుకోవాలి. నామినేషన్ పత్రంలో ప్రతిపాదకుల సంతకాలు, వారి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ముందే పరిశీలించుకోవాలి. అలాగే నామినేషన్కు కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లు, చెక్లిస్ట్, అఫిడవిట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి, గడువులోపు పూర్తి చేయడం చాలా ముఖ్యం అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధులలో పాల్గొనే ప్రతి ఉద్యోగీ పాటించాల్సిన కీలక సూచనలను జారీ చేశారు:1. స్పష్టమైన ప్లానింగ్ మరియు పర్యవేక్షణ:ఏదైనా పనిని ప్రారంభించే ముందే పూర్తి స్థాయిలో స్పష్టత కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. పనుల ప్రణాళిక, సామాగ్రి , మరియు అమలు ప్రక్రియలు సక్రమంగా జరగాలి. పనులను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని తక్షణమే గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల ఉద్యోగులకు పూర్తి అవగాహన మరియు అధికారం ఉండాలని స్పష్టం చేశారు.
2. రాజకీయాలకు దూరంగా నిష్పాక్షికత:ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, తమ వ్యక్తిగత అభిప్రాయాలను లేదా ఆలోచనలను ఎక్కడా వ్యక్తపరచకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశాలపై చర్చించడం ఉద్యోగ నియమావళికి విరుద్ధమని హెచ్చరించారు. కేటాయించిన సమయానికి విధులకు హాజరవుతూ, హ్యాండ్బుక్ లేదా డైరీని జాగ్రత్తగా చదువుకుని సద్ధంగా ఉండాలని సూచించారు.
3. క్రమశిక్షణారాహిత్యానికి తావులేదు – సస్పెన్షన్ హెచ్చరికసిబ్బందిని సరిగ్గా సమన్వయం చేసుకుంటూ, ఏఆర్వో మరియు ఆర్వో ల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. సిబ్బందికి కావలసిన సాంకేతిక సహాయం అందిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినా లేదా ఉన్నతాధికారుల మాట వినకపోయినా తక్షణమే ల దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
4. ఈ వి యం నిర్వహణ మరియు సన్నాహాలు:ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ ల నిర్వహణ మరియు ప్రాసెస్ పై ప్రతి ఒక్కరూ సరైన ముందస్తు సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమయపాలన పాటించాలని, రోజువారీ చెక్లిస్ట్ను సిద్ధంగా ఉంచుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణలో పోలీసు అధికారుల పాత్ర కీలకం: ఎస్పీ ఎస్వీ మాధవ్,రాబోయే ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, సజావుగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా చూడటంలో పోలీసు అధికారుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఎస్వీ మాధవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి) నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దే అవకాశం ఉండాలని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు కల్పించాలని, ఎక్కడైనా బయాస్డ్గా (పక్షపాత ధోరణితో) వ్యవహరిస్తే వెంటనే దాన్ని గుర్తించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ రోజులు మరియు కౌంటింగ్ సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎఫ్ఎస్టి , ఎస్ఎస్టి ఎంసిసి టీమ్లన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది అందరికీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా పరిషత్ సిఈఓ, ఏఆర్వోలు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.