వరి పంటలకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న
తెగుళ్లు ఆశించే వరి పంటలను పరిశీలించిన ఏవో జోత్స్న
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
గరుగుబిల్లి, అక్టోబర్ 17, మేజర్ న్యూస్:వరి పంటలకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జోత్స్న వెల్లడించారు. మండల పరిధిలోని పెద్దూరు,గొట్టివలస తదితర గ్రామాల్లో తెగుళ్లు ఆశించిన వరి పంట పొలాలను శనివారం మండల వ్యవ సాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జోత్స్న రైతులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా వరి పంటలో పురు గులు తెగుళ్లను గుర్తించే విధానము వాటి నివారణ చర్యలు అదే విధంగా తెగుళ్లు ఆశించిన వరి పంట పొలాలకు సంబంధించిన రైతులకు తెగుళ్లు నివారణపై తీసుకోవలసిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న తగు సూచనలు సలహాలను అందజేశారు.అనంతరం వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న మాట్లాడుతూ తెగుళ్లు ఆశించిన వరి పంటలకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు,సలహాలు మేరకు తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.తెగుళ్లు ఆశించిన వరి పంటలకు రైతులు తగు సస్యరక్షణ చర్యలు చేపట్టిన యెడల వరి పంట దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ప్రస్తుతం పెద్దూరు,గొట్టివలస గ్రామాల్లో వరి పంటలకు కాండం తొలిచే పురుగు, అంకురపు మచ్చ తెగులు,పొడతెగులు ఆశించిందన్నారు.కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరంట్రా నిలిప్రోల్ మందును పిచికారి చేయాల్సి ఉంద న్నారు.ఆకు ముడత పురుగు నివార ణకు క్లోరి ఫైరిఫస్ మందును ఎకరాకు అయిదు వందల ఎంఎల్ మందును పిచికారి చేయాల్సి ఉందన్నారు. వడ తెగులు నివారణకు హెక్సాకోనజోల్ మందును ఎకరాకు నాలుగు వందల ఎంఎల్ మందును పిచికారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరి పంటల కు పలు రకాల తెగుళ్లు ఆశిం చిన నేపథ్యంలో రైతులు పురుగు మందులను విచక్షణ రహితంగా వినియోగించరాదని పంటలో సమ తుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలని రైతులకు తెలియ జేశారు.అదే విధంగా మండల పరిధిలోని ఆయా గ్రామాలలో వరి పంటలకు తెగుళ్లు ఆశించిన యెడల తక్షణమే రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని తెలిపారు.ఈమేరకు వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న స్పష్టం చేశారు.వరి పంటలో నష్టాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచ నలు,సలహాలు పాటించాల్సి ఉందని ఏవో తుమ్మనపల్లి జ్యోత్స్న రైతులను కోరారు.