BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కసూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రెండింగ్ వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన యువ ప్రతిభావంతుడు బేల్‌రాజ్ కలరిక్కల్ అకస్మాత్తుగా కన్నుమూశారు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి

Select Suryaa Now
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి

 

ఎన్నికల విధుల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం

మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి

పార్వతీపురం, అక్టోబర్ 17 : ​మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి ​స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) పక్కాగా అమలు జరగాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 16, శుక్రవారం రాత్రి 08:30 గంటలకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నాహకాలపై సమీక్షించారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులెవ్వరూ ముందస్తు అనుమతి లేకుండా సెలవులపై వెళ్లరాదని, కేటాయించిన స్థానాల్లోనే ఉంటూ పూర్తి నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలును కఠినంగా పర్యవేక్షించాలని, నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని రకాల మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ సరఫరా మరియు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తూ, అధికారుల మధ్య మెరుగైన సమన్వయంతో ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.​ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పాలకొండ,పార్వతీపురం సబ్ కలెక్టర్లు జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత , జిల్లా పంచాయతీ అధికారి రవీంద్ర, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి  పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, మండల ప్రత్యేక అధికారులు, ఉప తహసీల్దార్లు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.