పాలకొండ నగర పంచాయతీ లో ఛైర్మన్, 17 కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్
పాలకొండ, మేజర్ న్యూస్ నగర పంచాయతీ ఎన్నికలు సందర్భంగా రెండవ రోజు నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ వద్ద శనివారం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి పాలవలస ఇందుమతి నామినేషన్ దాఖలు చేశారు. 17 మంది కౌన్సిలర్లలో వైసీపీ 12, జనసేన 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 నామినేషన్లు వేశారు.