తూరు మామిడి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా" కొల్లి "
*కోన అభ్యర్థిగా రౌతు ఆదినారాయణ
*ఇప్పటికే పది ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులను ఖరారు
*అభ్యర్థులకు విజయ తిలకం దిద్దిన పార్టీ అధ్యక్షులు మావుడి రంగు నాయుడు
*శంబర తో సహా మరో ఐదు స్థానాల అభ్యర్థులు రేపు ఖరారు
*జోష్ లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు
మక్కువ , అక్టోబర్ 17, (మేజర్ న్యూస్):-
త్వరలో జరగనున్న ఎంపీటీసీ ఎన్నికలకు గాను వైసిపి పార్టీ తరఫున అభ్యర్థులను ఆ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు ఖరారు చేస్తున్నారు. మండల కేంద్రమైన మక్కువతో సహా ఇప్పటికే తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి సంగతి తెలిసిందే. శనివారం నాడు మండలంలో ప్రత్యేకత సంతరించుకున్న తూరుమావుడి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థులుగా కొల్లి వాసుదేవరావు కుటుంబ సభ్యులకు కేటాయించారు. బీసీ మహిళకు కేటాయించిన తూరుమావుడి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన కొల్లి వాసుదేవరావు కుటుంబానికి చెందిన మహిళ అభ్యర్థికి టికెట్ పార్టీ అధ్యక్షులు కేటాయించి, విజయ తిలకం దిద్దారు. అలాగే కోన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రౌతు ఆదినారాయణ కి టికెట్ ఖరారు చేశారు. ఇంకా మండలంలో శంబర గ్రామముతో పాటు వెంకట బైరిపురం, కవిరిపల్లి, కాశీపట్నం, ఏ వెంకంపేట, డీ శిర్లాం ఎంపీటీసీ స్థానాలకు నేడు రేపు అభ్యర్థులను ఖరారు చేరినట్టు పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు టిక్కెట్లు కేటాయించిన అభ్యర్థులు గెలుపు జోష్ లో తమ తమ గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించడం విశేషం.!