BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా – 24 గంటల పాటు పర్యవేక్షణ

Select Suryaa Now
అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా – 24 గంటల పాటు పర్యవేక్షణ

 

ఎన్నికల నేపథ్యంలో పోలీస్ చెక్‌పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి

పార్వతీపురం, అక్టోబర్ 17, మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం చేపడుతున్న భద్రతా చర్యలను జిల్లా ఎస్ప ఎస్.వి. మాధవ్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల పంపిణీ, అక్రమ రవాణాను అరికట్టేందుకు పార్వతీపురంలో 3, పాలకొండలో 2, సాలూరులో 2 చొప్పున మొత్తం 7 పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు , స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.అక్టోబర్ 17న పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ తనిఖీ చేసి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.చెక్‌పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహన తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రవర్తనా నియమావళి  అమల్లో ఉన్నందున నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నగదు, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారి వద్ద అవసరమైన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.వాహన తనిఖీల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని అప్రమత్తతతో పరిశీలించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని లేదా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.