నేడు పోచమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోనున్న బీజేపీ ప్రముఖ నాయకులు:మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ముదిరాజ్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయాన్ని నేడు పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు, జిల్లా అధ్యక్షులు యు. రమేష్ కుమార్ ఆలయానికి విచ్చేసి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బిజెపి మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆలయానికి విచ్చేస్తున్న నాయకులను స్వాగతం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు, వివిధ మోర్చాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.