BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

" ముప్పై ఏళ్లు గా పురుషులకు దక్కని యంపిపి పీఠం "

Select Suryaa Now
" ముప్పై ఏళ్లు గా పురుషులకు దక్కని యంపిపి పీఠం "


*కొత్తూరు మండల పరిషత్ రిజర్వేషన్ లో అక్రమాలు చోటు చేసుకొన్నాయా ?
*1995నుండి నేటివరకు పురుషులకు దక్కని Tumlog.
*రిజర్వేషన్లు నిర్ణయం లో బలమున్నవాడిదే రాజ్యమా ?
కొత్తూరు అక్టోబర్ 17(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండల పరిషత్ లో ముప్పై సంవత్సరాలుగా మండల పరిషత్ అధ్యక్ష పీఠం పురుషులకు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు  సమితులను రద్దు చేసి 
మాండాలిక రాజ్యాంగ వ్యవస్థ అమల్లోనికి తీసుకొని వచ్చిన తర్వాత 1987లో మొట్టమొదటి సారిగా మండల పరిషత్ లకు ఎన్నికలు జరిగాయి.అదే సమయంలో ప్రత్యక్ష ఎన్నికలలో కొత్తూరు యంపిపి గా గోగుల చల్లం నాయడు ఎన్నికయ్యారు. అతర్వాత నేటివరకు యంపిపి పదవి  పురుషులకు దక్కలేదు.
2013లో కొత్తూరు యంపిపి పదవి యస్ టి మహిళలకు కేటాయించగా ఆరిక రాజేశ్వరి,   2021లో మళ్ళీ యంపిపి పదవి యస్ టి మహిళల కు కేటాయించగా సవర సావిత్రి ఎంపిపిగా ఎన్నికయ్యారు. 2001లో షెడ్యూల్ కులాలకు కేటాయించగా మండల పరిధిలో గల మాతల యంపిటిసి స్థానం యస్ సి జనరల్ కు కేటాయించగా కానీ భారతి పోటీ చేసి యంపిపి పదవి చేపట్టారు.ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యంపిపి పదవి యస్ సి మహిళలకు కేటాయించారు.  1995 , 2006 లో జరిగిన స్థానిక ఎన్నికలలో యంపిపి స్థానం వెనుకబడిన తరగతుల 
మహిళలకు కేటాయించారు. 1995 లో తీమర ప్రమీల ,2006లో ఆగతముడి విజయశ్రీ యంపిపి ల ఎన్నికయ్యారు. యంపిపి,జడ్పిటిసి పదవులకు అభ్యర్థులకు రోస్టర్ పద్దతిలో ఎంపిక చేయాలని పంచాయతీ రాజ్ చట్టం చెబుతోంది. 1995 నుండి 2026 వరకు పరిశీలిస్తే రెండు సార్లు బిసి మహిళలకు ,
నాలుగు పర్యాయాలలో రెండు సార్లు యస్ టి లకు ,రెండు సార్లు షెడ్యూల్ కులాలకు యంపిపి పదవులు కేటాయించారు. 1995 నుండి వరకు నేటివరకు ఏ కులానికి చెందిన పురుషులకు అవకాశం దక్కక పోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. యంపిపి అభ్యర్థులు ఎంపికలో రోస్టర్ పద్ధతి పాటించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.రోష్టర్ విధానం పాటిస్తే ఒక్క సారైనా ఏ కులానికి చెందిన పురుషులకు అవకాశం వచ్చి ఉండవచ్చునన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. రిజర్వేషన్లు నిర్ణయంలో బలమున్న నేతదలదే తుది నిర్ణయమని స్పష్టమౌతోంది.
రోష్టర్ విధానం లో పురుషులకు 
అవకాశం రాకపోవడం పై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఎంపిటిసిలు,సర్పంచ్ లకు రిజర్వేషన్లు నిర్ణయించడం 
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కి కృషిచేసిన గ్రామస్థాయి నాయకులకు అవకాశం రాకపోవడం తో పార్టీ అభివృద్ధి కి ఎందుకు కష్టపడి పనిచేయాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమౌతోంది.పాతపట్నం నియోజకవర్గం లో ఐదు మండలాలు ఉండగా పాతపట్నం ,కొత్తూరు,మండల పరిషత్ లు షెడ్యూల్ మహిళలకు,మెలియాపుట్టి ఎంపిపి యస్ టి ఆన్ రిజర్వుడు  ఆల్ కు కేటాయించడం పై నియోజకవర్గం నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.