BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

తోటపల్లిలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ

Select Suryaa Now
తోటపల్లిలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ

 

పంపిణీ చేసిన సేవా ట్రస్ట్ సభ్యురాలు అన్నపూర్ణమ్మ

గరుగుబిల్లి, అక్టోబర్ 17, మేజర్ న్యూస్:ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు శనివారం సేవా ట్రస్ట్ సభ్యురాలు వెలగాడ అన్నపూర్ణమ్మ ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు.తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం ఇటు ఉమ్మడి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.ఈమేరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు దాహార్తిని తీర్చేందుకు సేవా ట్రస్ట్ సభ్యురాలు వెలగాడ అన్నపూర్ణమ్మ భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడంతో ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు భక్తులు సేవా ట్రస్ట్ సభ్యురాలు వెలగాడ అన్నపూర్ణమ్మను అభినందించారు.ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ సభ్యురాలు వెలగాడ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.తనకు అవకాశం ఉన్నంతవరకు ప్రతి శనివారం భక్తులకు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ సభ్యులు మార్కొండ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.