తిరుపతి జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ..
తిరుపతి జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ..
*తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో రెండవ రోజు మేయర్ స్థానానికి 11, కార్పొరేటర్ స్థానానికి 184 నామినేషన్లు దాఖలు
* జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్ :
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా తిరుపతి జిల్లాలో రెండో రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
నామినేషన్ల వివరాలు
---------
తిరుపతి మేయర్ స్థానానికి 11, వార్డు మెంబర్లుగా 184 నామినేషన్స్ దాఖలు
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా రెండవ రోజు నామినేషన్ లలో భాగంగా మేయర్ స్థానానికి 11 నామినేషన్లు దాఖలు కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్ స్థానానికి దాఖలైన నామినేషన్ లలో టిడిపి తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 10 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ స్థానాలకు 184 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇందులో టిడిపి నుండి 86, వైయస్ఆర్ సీపీ నుండి 18, జనసేన నుండి 18, బిజెపి నుండి 8, సిపిఎం నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 47, ఇతరులు 6 మొత్తం 184 నామినేషన్లు అందాయన్నారు.
సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి 2, వార్డు మెంబర్లుగా 47 నామినేషన్లు దాఖలు
---------
32 వార్డులు గల సూళ్ళూరుపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి వై ఎస్ ఆర్ సి పి నుండి 2 నామినేషన్ లు దాఖలు కాగా, వార్డ్ మెంబర్ ల కింద 47 నామినేషన్ లు దాఖలు అయ్యాయన్నారు. ఇందులో బిజేపి నుండి 4, టిడిపి నుండి 16, వై ఎస్ ఆర్ సి పి నుండి 19, జనసేన నుండి 2, స్వతంత్ర్య అభ్యర్థులుగా 6, మొత్తం 47 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు.
నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి 2, వార్డు మెంబర్లుగా 29 నామినేషన్లు దాఖలు
------------
నాయుడుపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి టిడిపి నుండి ఒకటి, వైఎస్ఆర్సిపి నుండి ఒకటి మొత్తం రెండు నామినేషన్ లు దాఖలు చేయగా, 32 వార్డుల పరిధిలో వార్డ్ మెంబర్లుగా 29 నామినేషన్ లు దాఖలు అయ్యాయన్నారు. ఇందులో బి జే పి నుండి 1, టిడిపి నుండి 3, వై ఎస్ ఆర్ సి పి నుండి 22, జనసేన నుండి 1, స్వతంత్ర్య అభ్యర్థులు 2 మొత్తం 29 నామినేషన్ లు దాఖలు చేశారన్నారు.
వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ స్థానానికి 3, వార్డ్ మెంబర్లుగా 64 నామినేషన్స్ దాఖలు
-----------
వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి వై ఎస్ ఆర్ సి పి, టిడిపి, బి ఎస్ పి నుండి ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు నామినేషన్లు దాఖలు చేయగా, 36 వార్డుల పరిధిలో టిడిపి నుండి 39, వై ఎస్ ఆర్ సి పి నుండి 25, మొత్తం 64 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి 5, కార్పొరేటర్లుగా 72 నామినేషన్ దాఖలు
-----------
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి వై ఎస్ ఆర్ సి పి నుండి 3, టిడిపి నుండి 1, జనసేన నుండి 1 మొత్తం ఐదు నామినేషన్లు దాఖలు చేయగా, 36 వార్డుల పరిధిలో టిడిపి నుండి 48, వై ఎస్ ఆర్ సి పి నుండి 24, జనసేన నుండి 2, స్వతంత్ర అభ్యర్థుల నుండి 2 మొత్తం 76 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Raaju బ్యూరో, నేటి దినపత్రిక సూర్య తిరుపతి జిల్లా,