ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో BWU(బిడబ్ల్యూ) గెలుపు ఖాయం…
టిఆర్పి నియోజకవర్గ అధ్యక్షుడు ఎమ్మె సంతోష్…
ఆర్టీసీ ఎన్నికల్లో బహుజన వర్కర్స్ యూనియన్ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు అన్న సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో బహుజన వర్కర్స్ యూనియన్ తరపున టి పి ఆర్ పార్టీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. RTC కార్మికుల సంక్షేమం తీన్మార్ మల్లన్న ఆశయం ప్రతి కార్మికుడి కష్టసుఖాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాలుపంచుకుంటుందని ప్రతి RTC కార్మికుడి అభివృద్ధి దే మా ధ్యేయం BWU బలపరిచిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు అవ జగన్, కొందుర్గు మండల అధ్యక్షులు దర్గ వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి బుస జంగన్న, గడీల అంజయ్య, గుళ్ళు హరి ప్రసాద్, సంపంగి శంకర్, షాద్నగర్ మునిసిపల్ అధ్యక్షులు రాములు, RTC కార్మిక నాయకులు,మరియు TRP నాయకులు పాల్గొన్నారు.
M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…