BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

Select Suryaa Now
శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన ములకలచెరువు జడ్పీటీసీ స్థానం నుండి ఘనవిజయం సాధించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు జబ్బల శ్రీనివాసులు సతీమణి జబ్బల మీనా కుటుంబ సమేతంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు,మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు  స్వగృహంలో ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె విజయాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికలలో అఖండ విజయం సాధించి మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం ద్వారా శ్రీరామ్ చినబాబు చరిత్ర సృష్టించారని కొనియాడారు.ఆయన సారధ్యంలో మదనపల్లి అభివృద్ధి సరికొట్టి పుంతలు తొక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ జబ్బల శ్రీనివాసులు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి అని,బలమైన బీసీ నేతగా తన సత్తాను ఢిల్లీకి చాటారని ప్రశంసించారు.ఆయన సతీమణి జబ్బల మీనా ములకలచెరువు జడ్పిటిసిగా ఘన విజయం సాధించడం శుభపరిణామమన్నారు.ఆమె సారధ్యంలో ములకలచెరువు మండలం అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జబ్బల సాయి,డాక్టర్ మర్రిపాటి రమేష్,రాటకొండ శ్రీనివాసులు నాయుడు,కదిరి రాజకుమార్,ప్రభు కురబ గౌడ,జి.వి.నాయుడు,బిజెపి యువ నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి