ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
*శాలిగౌరారం మేజర్ న్యూస్ సూర్య*
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ధనంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ధనంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,మహిళలకు ఉచిత బస్సు,సన్న బియ్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్, జిల్లా కార్యదర్శి గూని వెంకటయ్య,మాజీ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు తోటకూరీ పరుశురాం, సర్పంచ్ లు గుజిలాల్ శేఖర్ బాబు,సంకటి లింగయ్య,పోగుల మనిషా-రాంబాబు,ఎర్ర రోజా-సుధాకర్,కత్తుల అంజయ్య,వంగూరి కవిత-వెంకన్న,ఉప సర్పంచ్ లు అయితగోని లక్ష్మయ్య,ఓగోటి శంకర్, పాపారావు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇంధనూరీ శ్రీను,
కాంగ్రెస్ నాయకులు నోముల జనార్ధన్, భూపతి అంజయ్య,
బొమ్మగాని రవి, భూపతి వెంకన్న,గుత్తా రవీందర్ రెడ్డి,పెరుమాడ్ల నరేష్,
కోక సాయి,ఇంద్రకంటి యాదయ్య,గంట్ల సాయి రెడ్డి,జమ్ము అశోక్,వలిశెట్టి సైదులు, తీర్పరి మల్లయ్య,మొగుళ్ళ శ్రీను,కడారి అంజయ్య,పాకాల సతీష్,బోడ సైదులు,నూక మహేష్, గంధమల్ల నాగార్జున, బోడ అరుణ్,బల్లెం వంశీ,చిలంశెట్టి సాయి , తదితరులు పాల్గొన్నారు..
ఫోటో రైటప్ :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు..