దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం
నవాబుపేట, మేజర్ న్యూస్:నవాబుపేట మండలంలోని ప్రతి గ్రామంలో ఎల్ఈడీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా మండల ప్రజలకు ఎంపీ అందిస్తున్న కానుకగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు.నవాబుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమానులు డి. సంపత్, జె. సంతోష్, ఎం. మహేందర్, బి. శ్రీకాంత్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నవాబుపేట మండలంలోని ప్రతి గ్రామంలో రాత్రివేళ వెలుగులు విరజిమ్మేలా ఎల్ఈడీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు తన ద్వారా సందేశం పంపించారని వెల్లడించారు. ఈ విషయాన్ని మండలంలోని సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మెరుగైన విద్యుత్ వెలుగులు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.అనంతరం చిట్టిగిద్ద గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గద్దెను మాజీ ఎమ్మెల్యే పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానులు డి. సంపత్, జె. సంతోష్, ఎం. మహేందర్, బి. శ్రీకాంత్, బీజేపీ నవాబుపేట మండల అధ్యక్షుడు చంద్రకాంత్, శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, భీమ్ రెడ్డి, వట్టి మీనపల్లి సర్పంచ్ తనయుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ అర్జున్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్, నరసింహులు, మణికంఠ రెడ్డి, శ్రీనివాస్, మహేందర్, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ఆంజనేయులు తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.