కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు
నవాబుపేట సూర్య న్యూస్:ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం చేపట్టిన‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’వేడుకలు మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ నూతన గృహాల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కొత్త ఇళ్ల ముందు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను‘ఇందిరమ్మ హౌసెస్’మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసి,సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. సొంతింటి కల సాకారమైన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పండుగ రూపంలో జరుపుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు,ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.