వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించారు. కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం, కొడంగల్ పోలీస్ స్టేషన్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్, దుద్యాల పోలీస్ స్టేషన్లకు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించి పోలీసు శాఖకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, చార్మినార్ జోన్ డీఐజీ చందనా దీప్తి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, టీ. రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.