BREAKING
ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. నల్గొండ జిల్లాలో నకిలీ మరణ ధ్రువీకరణతో కుమారుడికి కారుణ్య ఉద్యోగం.. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల్లో అక్రమాలు.. 14 మంది అరెస్ట్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్ 'దిమాగీ నక్సల్స్'తో దేశానికి ముప్పు పొంచి ఉంది: ప్రధాని మోదీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దీపావళి వేడుకలు విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు. మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెట్రి సినిమా జిల్లా కలెక్టర్ నివాసంలో బాలసదనం బాలికలతో దీపావళి సంబరాలు..… అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ప్రజా తీర్పుతో విజయం… అభివృద్ధి దిశగా మరో అడుగు

Select Suryaa Now
ప్రజా తీర్పుతో విజయం… అభివృద్ధి దిశగా మరో అడుగు

                                       విజేతలకు బూరుగుపల్లి శేషారావు దంపతుల ఘన సత్కారం..

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రజాప్రతినిధులు నవంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు దంపతులు విజయం సాధించిన ప్రజాప్రతినిధులందరినీ ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత ఉత్సాహంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజా తీర్పు బాధ్యతను గుర్తించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజేతలకు శేషారావు దంపతులు ఆకాంక్షించారు.