గంటా శ్రీనివాసరావు ని కలిసిన తాట్రాజు అప్పారావు (ఎంపీపీ)
ఆనందపురం : మేజర్ న్యూస్
ఆనందపురం మండలం బోని, శిర్లపాలెం పేకారు నాయకులతో కలిసి నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ తాట్రాజు అప్పారావు మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాట్రాజు అప్పారావు కి శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. బోని ఎంపీటీసీగా 703 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అనంతరం ఆనందపురం మండల అభివృద్ధి, బోని, శిర్లపాలెం గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, ప్రజా సమస్యలపై వారు చర్చించారు. మండల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాగవంశం డైరెక్టర్ సురాల సత్య వరప్రసాదరావు, శిర్లపాలెం సర్పంచ్ కోరాడ గౌరీనాయుడు, కర్రీ శ్రీనివాసరావు, శిర్ల అప్పలనాయుడు, డొకర రామనారాయణ, కేశవ్, జితేంద్ర, బోని, శిర్లపాలెం,పేకేరు గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.