మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెట్రి సినిమా
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎవరిూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో ఒక వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. యువ నటుడు వెట్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘బ్లాక్ గోల్డ్’. క్రూడాయిల్ లేదా మిరియాలు కాకుండా మానవ తల వెంట్రుకల వ్యాపారం మరియు దాని వెనుక ఉండే చీకటి ప్రపంచం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా మాఫియా, దాని చుట్టూ నడిచే భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని దర్శకుడు ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఈ వ్యాపారంలో పేరుకుపోయిన గ్రీడ్, పవర్ అలాగే హింస వంటి అంశాలను ప్రధానంగా హైలైట్ చేస్తూ ఈ కథను అల్లారు. ప్రియలయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో లివింగ్‌స్టన్, అభిరామి వెంకటాచలం, ఎ.వెంకటేష్, నిలగల్ రవి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ధీరన్ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ కుమార్ వీరసామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గవాస్కర్ అవినాష్ సంగీతం సమకూరుస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హ్యూమన్ హెయిర్ ట్రేడ్ చుట్టూ నడిచే అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌ను ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ చూపించని విధంగా అత్యంత సాహసోపేతంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ను నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సాధారణంగా సినిమాలలో గ్యాంగ్‌స్టర్ లేదా డ్రగ్స్ మాఫియా కథలను చూసి ఉంటాం, కానీ పూర్తిగా భిన్నమైన హెయిర్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశాలతో దూసుకుపోతున్న నటుడు వెట్రి కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ విభిన్నమైన యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేది వేచి చూడాలి.
Also Read: షాబాద్ రైతులకు మెగా రైతు మేళా సందడి