ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు...
ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు...
- సంబరాల్లో మునిగిన లబ్ధిదారుల కుటుంబం..
- పండగ సంతోషంలో కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు వేముల నరేష్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న లబ్ధిదారిని ఇంట్లో కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. గతంలో రేకుల షెడ్లలో ఇబ్బందులు పడుతూ బతికిన కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లో కొత్త కళలతో పండగను జరుపుకుంటున్నారు. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, దీపాల అలంకరణలో ఇల్లు కళకళలాడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ, సమాచార శాఖ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సౌజన్యంతో ఇందిరమ్మ ఇళ్లతో మండలంలో ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు మంజూరు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మండలంలో పూరి గుడిసె లేని మండలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం , దీపావళి పర్వదినాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం నాగభూషణం, జిల్లా నాయకుడు వేముల రమణ, మండల నాయకులు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్య (మేజర్ న్యూస్) , అన్నపురెడ్డిపల్లి…