ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లోని 4వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు నాగమణి కుటుంబంతో కలిసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కొత్త ఇంట్లో దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు, మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కేతావత్ వెంకటేష్, నీలం కవిత ముదిరాజ్ పాల్గొన్నారు.