ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వీట్లు అందజేశారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి వారితో కలిసి పండుగ సంబరాలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని, నూతన గృహాల్లో కుటుంబాలు ఆనందంగా పండుగలు జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.