మామిళ్లపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాల్లో భాగస్వాములయ్యారు.