షాబాద్‌లో ఘనంగా దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలు
పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)
దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం షాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పీఆర్ఆర్ఎమ్ స్టేడియంతో పాటు ముద్దెంగూడ, గొల్లూరుగూడ గ్రామాల్లో ఆయన జయంతి కార్యక్రమాలను నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.