ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్‌చెరు:ఇంద్రేశం మున్సిపాలిటీ చిన్నకంజర్లలో నిర్వహించిన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.