క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ ; దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అదనపు కలెక్టర్ నగేష్ తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా గడుపుతూ దీపావళి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా సాగిన దీపావళి వేడుకలు ఆత్మీయ వాతావరణాన్ని నింపాయి.