BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు ఎల్‌ఐవీ గోల్ఫ్ లీగ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బీసీ పార్టనర్స్' ప్రయత్నాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరాన్‌లో వరుస పేలుళ్లపై స్పష్టతనిచ్చిన టెహ్రాన్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సుడాన్‌లో అహ్మద్ హారౌన్ అరెస్ట్, మాజీ అధికార పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న సైన్యం ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్ ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు... క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్ దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు

అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి

Select Suryaa Now
అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి

 

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నుంచి ఏలికట్ట డేటా సెంటర్ల వరకు.. పర్యావరణంపై గళమెత్తిన నాయకులు!

ఫరూక్నగర్ రంగారెడ్డి

:

దీపావళి పండుగను పురస్కరించుకొని షాద్‌నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద దీపాలు వెలిగించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడం మాత్రమే కాదని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం వెనుక భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ వంటి ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసింది మనం స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, గౌరవంగా జీవించాలనే ఆశయంతోనేనని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఇదే సమయంలో షాద్‌నగర్ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పరిశ్రమలు, వివిధ కంపెనీలతో పారిశ్రామికంగా విస్తరిస్తున్న షాద్‌నగర్ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, ప్రజల ఆరోగ్యానికి, పరిసరాల పరిశుభ్రతకు భంగం కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా ఏలికట్ట ప్రాంతంలో ప్రతిపాదిత డేటా సెంటర్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, కంపెనీల విస్తరణ నేపథ్యంలో అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో ప్రజల ఆరోగ్యం, భూగర్భజలాలు, గాలి నాణ్యత, స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.కాలుష్యాన్ని పెంచే బాణసంచాకు దూరంగా ఉంటూ, మట్టి దీపాలు వెలిగించి పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.మన ఇళ్లలో వెలిగించే దీపాలు కొన్ని గంటల తర్వాత ఆరిపోయినా, అమరవీరుల త్యాగాల జ్యోతి ఎప్పటికీ ఆరిపోకూడదని, భావితరాలకు దేశభక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ విలువలను అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీ శ్రీనివాస్, సత్యనారాయణ, పసుపుల ప్రశాంత్, ఆకాష్, భీమయ్య తదితరులు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద దీపాలు వెలిగించి నివాళులర్పించారు.