హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి ; మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావు ని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ , మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ , జైపాల్ రెడ్ , మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.