పేదల సొంతింటి కల సాకార మే ప్రభుత్వ లక్ష్యం ఎంపీ, ఎమ్మెల్యే
ఆమనగల్లు రంగారెడ్డి:
ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు, 13వ వార్డు లోని ఇందిరమ్మ లబ్ధిదారులు చంద్రాన్ పల్లి తండా జటావత్ శంకర్, అశోక్ ఇండ్లలో ఆదివారం దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా పాలనలో పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారని, గత ప్రభుత్వ హయాములో రాష్ట్రంలో ఏ పేదవాడికి ఒక్క ఇల్లు మంజూరు చేసిన పాపాన పోలేదని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే పేదల ఆత్మగౌరవం పెంపొందించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి, పేదల సొంతింటి కల సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలుగొండ మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, నాయకులు విజయ్, సత్యం, కృష్ణ నాయక్, ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ శాలిని తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.