కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.
కొందుర్గ్ (రంగారెడ్డి):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కొందుర్గు మండల కేంద్రంలోని బస్‌స్టాండ్ ఆవరణలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కోగూరి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని వృద్ధులు, ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోగూరి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్, కావలి యాదయ్య, ఫహిమొద్దీన్, మల్లేష్ గౌడ్, కొందుర్గ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కడిగల్ల మహేందర్, సర్పంచులు విక్రమ్ రెడ్డి, అంజయ్య, యాదయ్య, అమర్నాథ్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు రాములు, మానయ్య, జీబీ కృష్ణ, బోరిగ నరేందర్, బొజ్జిగారి నర్సింలు, దుర్గాని శ్రీను, బోరిగ యాదయ్య, మైపాల్ రెడ్డి, మాదారి నర్సింలు, కావాలి లక్ష్మయ్య, అశోక్, గోపాల్, జిల్లెల ప్రవీణ్, అమృతయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్, రమేష్, సాయిరెడ్డి, శశి, సత్యం రెడ్డి, దర్శన్, రామకృష్ణ గౌడ్, శ్రీకాంత్, అజీమ్, పద్మయ్య, మల్లేష్, బోడ, సాల్వారెడ్డి, చిలుకమర్రి, మర్రిరెడ్డి, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.