నేటిమన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శనను విజయవంతం చేయండి. ఏడిఏ శోభారాణి
ఆమనగల్లు రంగారెడ్డి:
రాష్ట్ర ప్రభుత్వం నేడు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో నిర్వహిస్తున్న మన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శన 2026 కార్యక్రమంకు వ్యవసాయ శాఖడివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, మాడుగుల మండలాల రైతులు తరలిరావాలని ఏ డి ఏ శోభారాణి కోరారు. మహోత్సవం లో పాల్గొనేందుకు తరలి వెళ్లే రైతుల సౌకర్యార్థం డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్ మండలాలకు ఒక్కొక్క మండలానికి నాలుగు బస్సులు, తలకొండపల్లి మండలానికి ఐదు బస్సులు, మాడ్గుల్ మండలానికి రెండు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. వేడుకలో రైతులు పాల్గొని ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పంటల సాగులో ఆధునిక పద్ధతులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తదితర అంశాలపై ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు సంబంధిత ఏవో, ఏఈవోలను సంప్రదించి బస్సులు బయలుదేరు సమయం ప్రదేశం వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రదర్శనలు తిలకించి అవగాహన పెంచుకునేందుకు రైతులు సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆమె కోరారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.