ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
*కడ్తాల్ రంగారెడ్డి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.
కొడంగల్ నివాసంలో పలువురు నేతలు ముఖ్యమంత్రి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ మల్లు రవి గారితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారితో పాటు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, ప్రముఖులు, అధికారులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.