BREAKING
వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం

బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు

Select Suryaa Now
బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్:చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను బొంరాస్‌పేట్ మండల కేంద్రంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని వీధులు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు దీపాల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని డాక్టర్ బండారి బండునాథ్ హాస్పిటల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, దీపారాధన నిర్వహించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో వ్యాపారులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుకాణాలను పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా పురోగతి సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు.సాయంత్రం వేళ ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించగా, చిన్నారులు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. దీంతో మండల కేంద్రం మొత్తం దీపాల కాంతులతో వెలిగిపోతూ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మండల ప్రజలు ఆకాంక్షించారు.