వైభవంగా స్వామివారి గ్రామ సేవ..
వైభవంగా స్వామివారి గ్రామ సేవ...
- మంగళ వాయిద్యాలు, చించుబుడ్ల వెలుగులతో గ్రామమంతా భక్తి పారవశ్యము..
అన్నపురెడ్డిపల్లి, సూర్య (మేజర్ న్యూస్).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రముఖ వైష్ణవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ మేనేజర్ పాకల వెంకటరమణ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామ సేవ (గ్రామోత్సవం) అత్యంత వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు స్వామి వారికి ఘన స్వాగతం పలుకుతూ హారతులు ఇస్తూ భక్తితో మొక్కుకున్నారు. ప్రతి వీధిలో మహిళలు దీపాలు వెలిగించి, టపాసులు, చించు బుడ్ల వెలుగుల్లో స్వామి వారి ఘన స్వాగతం పలకడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరగడంతో భక్తులు భక్తి పారవశమైయ్యారు. గ్రామ వీధులు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది.