BREAKING
అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి తల్లిదండ్రులతో కరీనా కపూర్ దీపావళి వేడుకలు: క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ క్వీన్ రామాయణంలో సీతమ్మ యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు: అలాంటి ఘట్టాలు నాకు గుర్తులేవు కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు కిల్లర్ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ వివాదం: ట్విస్ట్ గెస్ చేయడంలో ఎవరూ గెలవలేదన్న మేకర్స్ నేటిమన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శనను విజయవంతం చేయండి. ఏడిఏ శోభారాణి పేదల సొంతింటి కల సాకార మే ప్రభుత్వ లక్ష్యం ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సోనీ పిక్చర్స్ అండ: ‘వారణాసి’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌పై భారీ ఒప్పందం నటి రెజీనా కీలక పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త చిత్రం: షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ దీపావళి పోస్టర్ రిలీజ్: సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు ముగిసిన ‘ముహూరత్ ట్రేడింగ్’

గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్*

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్*

 

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
- ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
- ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగాలి

*చింతపల్లి మేజర్ న్యూస్ నల్లగొండ జిల్లా.:* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చింతపల్లి మండలం గోడుకొండ్ల–వెంకటేశ్వర నగర్, మాల్ పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దేవరకొండ శాసనసభ్యులు *నేనావత్. బాలునాయక్*  కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజా పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని మరింత పెంచుతున్నారని పేర్కొన్నారు.

*రేవంతన్న నాయకత్వంలో మరింత అభివృద్ధి సాధించాలి*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేవరకొండ నియోజకవర్గంతో పాటు చింతపల్లి మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రేడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చింతపల్లి మండల కేంద్రంతో పాటు,  చింతపల్లి మండల వ్యాప్తంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.