కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు*
*కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు*
*పార్ధీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఎమ్ సి మాజీ చైర్మన్ భట్టు కిషన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు
మాడ్గుల(రంగారెడ్డి)
మాడ్గుల మాజీ ఎంపిటిసి సభ్యులు, కె.పి. డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ నేత కొత్త పాండుగౌడ్ ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురికాగా కుటుంబీకులు హైద్రాబాద్
హైద్రాబాద్ సాగర్ కాంప్లెక్స్ సమీపంలోని బృంగీ ఆసుపత్రికి తరలించినప్పటికి ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పాండుగౌడ్ అకాలమృతి వార్త తెలుసుకున్న మండల కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో నర్సాయపల్లికి తరలివచ్చి పాండుగౌడ్ పార్ధీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఎమ్ సి మాజీ చైర్మన్ భట్టు కిషన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వై. వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ జడ్ .పి .టి .సి.ప్రభాకర్ రెడ్డి, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు తుమ్మ జోజి రెడ్డి, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ పులికంటి లక్ష్మయ్య, ఇర్విన్ మాజీ సర్పంచ్ గాదెమోని యాదయ్యగౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు గౌని నర్సింహ్మ గౌడ్, ఇర్విన్ ఉపసర్పంచ్, యువజన కాంగ్రెస్ కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు గాదెమోని దళపతిగౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ ప్రధాన కార్యదర్శులు కొప్పుల శేఖర్ గౌడ్, ఉడుతల నందీశ్వర్ గౌడ్, సుద్ధపల్లి సర్పంచ్ గజ్జ స్వాతిసత్యం గౌడ్, ఇర్విన్ మాజీ సర్పంచ్ రాజమోని పుష్పలతజంగయ్య యాదవ్, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ బొమ్ము మంగమ్మ నాగయ్య, బిఆర్ఎస్ నాయకులు పబ్బు యాదయ్య గౌడ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు ఎర్కలి కాటం గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు మట్ట వెంకటేష్ గౌడ్, ఏఎమ్ సి మాజీ డైరెక్టర్ జెల్ల రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జెనిగెల దుర్గాప్రసాద్ యాదవ్, గాదెమోని అంజనేయులు గౌడ్ తదితరులతో పాటు మాడ్గుల సి.ఐ వేణుగోపాల్, ఎస్.ఐ రాఘవేందర్ గౌడ్, మండల పంచాయతిరాజ్ శాఖ ఏ.ఈ కృష్ణయ్య, మాడ్గుల పంచాయతి కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు కొండల్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాండు గౌడ్ పార్ధివదేహానికి నివాళులర్పించారు.
----------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల