BREAKING
కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు కిల్లర్ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ వివాదం: ట్విస్ట్ గెస్ చేయడంలో ఎవరూ గెలవలేదన్న మేకర్స్ నేటిమన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శనను విజయవంతం చేయండి. ఏడిఏ శోభారాణి పేదల సొంతింటి కల సాకార మే ప్రభుత్వ లక్ష్యం ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సోనీ పిక్చర్స్ అండ: ‘వారణాసి’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌పై భారీ ఒప్పందం నటి రెజీనా కీలక పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త చిత్రం: షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ దీపావళి పోస్టర్ రిలీజ్: సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు ముగిసిన ‘ముహూరత్ ట్రేడింగ్’ కట్టంగూరులో లబ్ధిదారుల నూతన గృహంలో సంబరాలు.. దీపాలు వెలిగించిన మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ?

చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం!

Select Suryaa Now
చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం!

నర్సింగ్ హాస్టల్‌లో కలుషిత ఆహారం.. 80 మంది విద్యార్థినిలకు అస్వస్థత, 16 మందికి ఆస్పత్రిలో చికిత్స.. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

ఆసుపత్రిని సందర్శించిన DMHO AO మహమ్మద్ షఫీయోద్దీన్

(రంగారెడ్డి, మేజర్ న్యూస్) రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని పీఎంఆర్ హాస్పిటల్ నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం చేసిన సుమారు 80 మంది నర్సింగ్ విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మంది విద్యార్థినులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

విద్యార్థుల కథనం ప్రకారం.. ఉదయం వండిన చికెన్‌ను రాత్రి భోజనంలో వడ్డించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో ఆస్పత్రిని సందర్శించనున్నారనే సమాచారంతో ఆశా వర్కర్లు కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలిసింది. మరోవైపు, అస్వస్థతకు గురైన విద్యార్థులకు పీఎంఆర్ హాస్పిటల్ యాజమాన్యం తమ సొంత ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తోంది.

నర్సింగ్ విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలు ఈ ఘటనతో చర్చనీయాంశంగా మారాయి. ఆహారం నాణ్యత, హాస్టల్‌లో పరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉండగా నర్సింగ్ విద్యార్థినిలు కేరళ గంజిలో చట్నీ వేసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చని PMR ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ విద్యార్థినిలు ఉదయం వండిన చికెన్ సాయంత్రం తిన్నామని అందుకే ఇలా జరిగిందని విద్యార్థినిలు పేర్కొంటున్నారు.

DMHO AO మహమ్మద్ షఫీయోద్దీన్ PMR ఆసుపత్రిని ఆదివారం రాత్రి సందర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.