కట్టంగూరులో లబ్ధిదారుల నూతన గృహంలో సంబరాలు.. దీపాలు వెలిగించిన మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'ఇందిరమ్మ దీపావళి' సంబరాలు కట్టంగూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండల కేంద్రానికి చెందిన గుండు రజిత-వెంకన్న గౌడ్ నూతన గృహంలో ఆదివారం దీపావళి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న హాజరయ్యారు. వారు లబ్ధిదారుల నూతన గృహంలో స్వయంగా దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఇంటిలో తొలి దీపావళి జరుపుకుంటున్న కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. సొంతింటిలో తొలి దీపావళి జరుపుకోవడం లబ్ధిదారుల జీవితంలో మరచిపోలేని మధురమైన అనుభూతి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.
నూతన ఇందిరమ్మ ఇంటిలో నిర్వహించిన ఈ వేడుకలు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఉత్సాహభరితంగా సాగాయి. దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలతో ఇల్లంతా పండుగ శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో కట్టంగూర్ ఉపసర్పంచ్ గుండు రాంబాబు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిట్టపల్లి శివశంకర్, రెడ్డిపల్లి వీరస్వామి, గోషిక అంజన్ కుమార్, కానుగు లింగయ్య, గుండు పరమేష్, చిక్కుల లింగయ్య, గాదగోని వెంకన్న గౌడ్, చెరుకు శీను, అయితగోని మల్లికార్జున్ గౌడ్, గుణల లింగయ్య, వార్డు సభ్యులు అయితగోని సైదులు గౌడ్, అయితగోని సైదమ్మ, యర్కల శశిధర్ గౌడ్, కానుగు శ్రీను, ముశం లావణ్య, ఉమేష్, బొమ్మగాని మహేష్ గౌడ్, మైనం ఉమా అంబేద్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు మేడి విజయ్ కుమార్, వీరమల్ల సూరి, కాడింగ్ శంకర్, దాసరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.